29, ఏప్రిల్ 2015, బుధవారం

neethu cheppina avineethi kadhalu

ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో బడా నేతల బాగోతం బయటకొస్తోంది. ఓ ఎమ్మెల్యేతోపాటు మరో ఇద్దరు నేతలకు ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అరెస్టయిన సినీనటి నీతూ అగర్వాల్ కర్నూలు పోలీసుల విచారణలో సంచనల విషయాలు వెల్లడించినట్లు సమాచారం. ఎర్రచందనం స్మగ్లర్ మస్తాన్ వలీతో సహజీవనం నిజమేనని... అతను కొంతమంది స్మగ్లర్లతో మాట్లాడించేవాడని, తన ఎకౌంట్ ద్వారానే వారికి నగదు బదిలీలు జరిపేవాడని పోలీసుల విచారణలో వెల్లడించిందామె. 
ప్రేమ ప్రయాణం మూవీ ద్వారా ఏర్పడిన పరిచయంతో తర్వాతి కాలంలో ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. మస్తాన్ తనకు హైదరాబాద్‌లో ఓ ఇల్లు కొనివ్వడంతోపాటు కొంత నగదు మొత్తాన్ని కూడా తన పేరిట డిపాజిట్ చేశాడని నీతూ అంగీకరించింది. ఇవన్నీ పాత విషయాలే అయినా ఇప్పుడామె చెప్పినవాటిలో కొత్తవి కొన్ని రాజకీయ నేతల్లో గుబులురేపుతున్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, మరో ఇద్దరు రాజకీయ నేతలకు ఈ ఎర్ర చందనం స్మగ్లింగ్‌తో ప్రత్యక్ష సంబంధాలున్నాయని నీతూ తన వాంగ్మూలంలో పేర్కొంది. దీంతో నీతూ వెల్లడించిన వివరాల ఆధారంగా సదరు నేతల జాతకాలు బట్టబయలు చేసే పనిలో పోలీసులు బిజీ అయ్యారు.

maruthunna bhubramanam

ఉత్తరాది ప్రాంతమంతా కూడా నేపాల్ దిశగా కదులుతున్నట్లు కనిపిస్తోందని గుర్తు చేశారు. లోగడ 1934లో బీహార్‌లో సంభవించిన పెను భూకంపంలో కూడా అక్కడి భూభాగంలో సుమారు 12 అడుగులు నేపాల్ దిశగా కదిలిన విషయాన్ని పరిశోధకులు పేర్కొన్నారు. శనివారం నేపాల్‌లో వచ్చిన భూకంపం అనూహ్యమేమీ కాదని, ఐతే ఇంత భారీగా సంభవిస్తుందని మాత్రం తాము అంచనా వేయలేదని వారంటున్నారు. ఇదిలావుండగా హిమాలయాల ఎత్తు ముఖ్యంగా ఎవరెస్ట్‌ పర్వతం ఎత్తు పెరగలేదని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. లేకుంటే ఇప్పటికే 8,848 మీటర్ల ఎత్తున్న ఎవరెస్ట్‌ మరికొంత పెరిగేదని అంటున్నారు. ఐతే, ఎవరెస్ట్‌ ఎత్తు పెరగనంత మాత్రాన. ఇతర పరిణామాలు ఆగేలా లేవు. భారత ఉపఖండం యథా ప్రకారం ఉత్తరానికి జరుగుతూ తన పరిమాణాన్ని తగ్గించుకుంటూనే ఉంటుంది. టిబెట్‌, నేపాల్‌, భారత్‌, పాకిస్థాన్‌, బర్మా ప్రాంతాలకు ఎప్పుడైనా, ఎక్కడైనా భూకంప ప్రమాదం మరింత పెరిగింది.

nepal bhukampam taruvatha chitralu