7, జూన్ 2015, ఆదివారం

aagina arthi gunde chappudu

భారత్‌లోని గుజరాతీ సంప్రదాయ కుటుంబానికి చెందిన ఆర్తి అగర్వాల్ అమెరికాలోని న్యూజెర్సీలో పుట్టి పెరగడంతోపాటు అక్కడే చదువుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ సినిమా 'పాగల్‌పన్' కోసం 2001లో ఇండియాకొచ్చిన ఆర్తి.. అదే సంవత్సరంలో తెలుగులో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో లీడ్ రోల్ పోషించే ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమాలో ఆర్తి పర్‌ఫార్మెన్స్, గ్లామర్ అన్నీ బాగుండటంతో ఆ వెంటనే ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చిపడ్డాయి. 
నువ్వు నాకు నచ్చావ్ తర్వాత నువ్వు లేక నేను లేను, అల్లరి రాముడు, ఇంద్ర, నీ స్నేహం, పల్నాటి బ్రహ్మనాయుడు, వసంతం, వీడే, అడవి రాముడు, నరసింహుడు, అందాల రాముడు వంటి సినిమాల్లో నటించింది. అయితే తన కెరీర్ ఎంత వేగంగా పుంజుకుందో అంతే వేగంగా పడిపోవడం ఆర్తిని కొంత కుంగదీసింది. తెలుగులోనే దాదాపు 20కుపైగా సినిమాలు చేసిన ఆర్తి... అవకాశాలు తగ్గిన తర్వాత కొన్ని ఐటంగాళ్ పాత్రలు కూడా చేసింది. కొన్ని సినిమాలకే లావు పెరగడం, 2005లో లవ్ స్టోరీ కారణంగా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం వంటివి ఆమెకి అవకాశాలు సన్నగిల్లిపోయేలా చేశాయి. చివరిగా అమ్మ రాజశేఖర్‌తో 'ఆమె ఎక్కడ' సినిమా చేసిన ఆర్తి.. లైపోసక్షన్ ట్రీట్‌మెంట్ కోసం న్యూజెర్సీకి వెళ్లి తాను పుట్టి పెరిగిన చోటే కన్నుమూసింది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి