23, ఆగస్టు 2015, ఆదివారం

rajadhani bhumulapai ratcha

ఏడాదికి నాలుగు లేదా మూడు పంటలు పండే భూములను నాశనం చేసి, రైతుల కన్నీళ్లతో రాజధాని కట్టవద్దని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇష్టపడి ఇస్తే భూములు తీసుకోవాలని, కాదని భూసేకరణకు దిగితే ధర్నాకు దిగుతానంటూ హెచ్చరించారు. తాను మాట్లాడిన ప్రతిమాట జాగ్రత్తగా మాట్లాడుతున్నానని అంటూనే, అలనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పాలనను గుర్తు చేశారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ విషయంలో భూములు కోల్పోయినప్పుడు మురళీమోహన్ ఎందుకు కోర్టుకు వెళ్లారని ప్రశ్నించారు. భూసేకరణకు సంబంధించి వెంటనే నోటిఫికేషన్ ఆపాలని కోరుతూనే.. గుంటూరు ఎంపీ, మురళీమోహన్ వచ్చి రైతులతో సంప్రదింపులు చేయాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. కాదని టీడీపీ ప్రభుత్వం మొండిగా వెళ్తే, అప్పుడు తన విశ్వరూపం చూపిస్తానంటూ వాగ్భాణాలు సంధించారు. నిపుణులతో కమిటీ వేసి భూసేకరణ చట్టంలోని లోపాలను సరిదిద్దాలని కోరారు. ఇప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తనకు నమ్మకముందని విశ్వాసాన్ని పవన్ వ్యక్తం చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి