9, మార్చి 2014, ఆదివారం

sthanika ennikala poru siddham

జిల్లా, మండల పరిషత్‌ల ఎన్నికల సమరానికి సోమవారం ముహూర్తం ఖరారు కానుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి ఈరోజు షెడ్యూల్ ప్రకటించనున్నారు. మునిసిపాలిటీ, అసెంబ్లీ, లోక్‌సభ, ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన నేపథ్యంలో ఈ మూడు ఎన్నికలకు వర్తించే నిబంధనావళిలో పెద్దగా తేడాలు లేకపోయినా.. మొత్తంగా రాష్ట్రంపై ఈ ప్రభావం కనిపించనుంది. పల్లెలు, పట్టణాలు, నగరాలు అన్న తేడా లేకుండా ఈ రెండు నెలల పాటు ఎన్నికల సందడి నెలకొననుంది. చట్టసభల ఎన్నికలకు భిన్నంగా స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం ఉంటుంది. 
ఈ ఎన్నికలు పార్టీల ప్రాతిపదికన, వాటి గుర్తులపైనే జరుగుతాయి. తొలిసారిగా ఈ ఎన్నికల నుంచే ఈవీఎంలు ప్రవేశపెట్టాలని భావించినప్పటికీ, ఇతర ఎన్నికల కారణంగా సాధ్యంకాలేదు. దీంతో గతంలో మాదిరిగానే పరిషత్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ద్వారానే ఓటింగ్ జరగనుంది. జెడ్‌పీటీసీ బ్యాలెట్‌ను తెలుపు రంగులో, ఎంపీటీసీ బ్యాలెట్‌ను గులాబీ రంగులో ముద్రిస్తారు. 10 నగర పాలక సంస్థల్లో 10 నుంచి 13వ తేదీ వరకు, మునిసిపాలిటీలు/నగర పంచాయతీల్లో 10 నుంచి 14వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి