21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

desam vypu mantrulu

రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. దీంతో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన కొంతమంది నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై అప్పుడే వేరే పార్టీలలో కర్చీఫ్‌లు వేసేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా పార్టీలకు చెందిన నేతలు మరో పార్టీల్లో జంప్ అయ్యారు. తాజాగా అదే బాట పడుతున్నారు కొంతమంది సీమాంధ్రకు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు. వచ్చే నెల 8వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు గంటా శ్రీనివాసరావు.
ఈ అంశంపై ఆయన శుక్రవారం తన నియోజకవర్గ నేతలతో పాటు జిల్లా టీడీపీ నేతలతో కీలక చర్చలు జరిపారు. చివరికి ఆయన తన సొంత పార్టీకే వెళ్లాలని నిశ్చయించుకున్నారు. గంటా టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు గత కొంతకాలం నుంచి మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈయనతో పాటు మరో నలుగైదుగురు ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరే అవకాశాలున్నాయి. మరోవైపు...అదే పార్టీకి చెందిన చిత్తూరు జిల్లా మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కూడా టీడీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధమైనట్టు వార్తలొస్తున్నాయి. తన కుమారుడు గల్లా జయదేవ్‌ను టీడీపీ తరపున ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపేందుకు వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు గుంటూరు నగరంలో శుక్రవారం గల్లా జయదేవ్ భారీ కటౌట్లు వెలిశాయి. దీంతో ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. మరో ముందడుగు పేరుతో నగరంలో ఆయన కటౌట్లు నిర్మించారు. ఈనెల 24 లేదా 27 తేదీలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం. 
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి