28, సెప్టెంబర్ 2015, సోమవారం

ciru re entry

మెగా అభిమానులకు  దసరా పండగ ముందే వచ్చేసినంత సందడి.దాదాపు ఆరేళ్ళ  గ్యాప్ తరువాత  చిరంజీవి  తన కొడుకు బ్రూస్లీ సినిమా కోసం మళ్లీ  మేకప్ వేసుకున్న రోజు.. ఇవాళ తమ సుప్రీం హీరో చిరంజీవి సెట్లోకి అడుగుపెట్టారు . మెగా ఫోన్ చేత బట్టిన శ్రీను వైట్ల    కూడా  ఈ  సందర్భాన్ని  అంత ఈజీగా తీసుకోలేదు.చిరంజీవి సెట్లోకి వస్తున్నారని తెలియగానే  షూటింగ్ సింపుల్ గా పూర్తి చేయకుండా థూం థాం  చేశాడు.
స్పాట్  అంతా అదిరిపోయేలా గుర్రాలు,హెలికాప్టర్లు, అనేక మంది మెగా అభిమానులు,  తమ అభిమాన నటుడికి శుభాకాంక్షలు తెలిపే సీన్ నే చిరంజీవి ఇంట్రడక్షన్ సీన్ గా షూట్  చేశారు. ఈ షూటింగ్ షెడ్యూల్  లో చిరంజీవి మూడురోజులు పాల్గొంటారని టాక్.   చిరంజీవి   క్యారెక్టర్ లెంగ్త్  కేవలం పది నుంచి పదిహేను  నిమిషాలు మాత్రమే ఉంటుందట. అందుకే చిరంజీవి లుక్ ఏ మాత్రం లీక్  కాకుండా సెట్లో  చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.చిరంజీవి తో షూటింగ్ చేయడం  తన అదృష్టంగా భావిస్తున్నానంటూ శ్రీనువైట్ల తన ట్విట్టర్ లో  రాసుకొచ్చాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి