1, అక్టోబర్ 2015, గురువారం

maining raja cinima bajaa

మైనింగ్ ఘనుడు గాలి జనార్థన్‌రెడ్డి ఫిల్మ్ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇస్తున్నాడా? ఈ తరహా క్యాంపెయిన్ ఫిల్మ్‌నగర్‌లో జోరందుకుంది. బెంగుళూరు టు హైదరాబాద్‌ల మధ్య ఆయన చక్కర్లు కొడుతున్నట్లు టాక్. టాలీవుడ్ ఫిల్మ్‌పై ఆయన ఆరా తీయడం కూడా మొదలుపెట్టేశాడట. ఇప్పట్లో కర్నాటకలో ఎన్నికలు లేకపోవడంతో ఇండస్ర్టీ వైపు ఆయన ఓ కన్నేసినట్టు గుసగుసలు.
అంతేకాదు సినిమా చేయాలనే ప్లాన్‌లో ఆయన వున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇందులో నిజమెంతో? రీసెంట్‌గా బర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్‌బాబు.. గాలి జనార్థన్‌రెడ్డిని బెంగుళూరులో ఆయన ఇంట్లో కలిశాడు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అక్రమ మైనింగ్ కేసులో దాదాపు రెండేళ్ల వరకు జైలులో గడిపిన మాజీమంత్రి గాలి జనార్థన్‌రెడ్డి, ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు.
ఆ తర్వాత గాలి జనార్థన్‌రెడ్డి క్లోజ్ అనుచరుడి బర్త్‌డే సెలబ్రేషన్స్ బళ్లారిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు టాలీవుడ్ నుంచి ఓ టీమ్ కూడా వెళ్లింది. వీళ్లకి ప్యాకేజ్ కూడా భారీగానే ఇచ్చాడట. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రొడ్యూసర్‌గా టాలీవుడ్‌లోకి గాలి అడుగుపెడతాడంటూ ఆర్టిస్టులు చర్చించుకుంటున్నారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి