21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

ika vaatalu

రాష్ర్ట విభజన నేపధ్యంలో ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. సహజ వనరులు, నీటి పంపకాలు, ఉద్యోగాలు, విద్యావకాశాలు, ఆదాయ వనరులు.. ఇలా ఎవరెవరు ఏమేం నష్టపోతారోనన్న భయం ఇరు ప్రాంతాల వాసుల్లో కనిపిస్తోంది. అయితే అదే సమయంలో ప్రజలకు మించిన టెన్షన్ మాకుంది అంటున్నారు కొందరు అయ్యా.. ఎస్.. (ఐఏఎస్) అధికారులు. ఇప్పటివరకు అన్ని శాఖల్లో పథకాల అమలు తీరు, జిల్లాల్లో పరిపాలన, అభివృద్ధి వంటి అంశాలని దగ్గరుండి సమీక్షిస్తూ అడ్మినిస్ట్రేషన్‌లో కీలక పాత్ర పోషిస్తున్న తమ పరిస్థితి ఇకపై ఏం కానుంది అనే టెన్షన్ ఐఏఎస్ అధికారుల్ని వేధిస్తోంది. రాష్ర్ట విభజన తర్వాత కొత్త రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ముందునుంచీ ప్రచారం జరుగుతున్నట్లుగా వినుకొండ సమీపంలోని నల్లమల అడవుల్లోనే కొత్త రాజధాని నిర్మాణం జరుగుతుందా? ఒకవేళ అదేకానీ జరిగితే తామంతా వెళ్లి ఆ అడవుల్లో కూర్చుని ఫైళ్లు తిప్పేయాల్సిందేనా అనేది వీరి ఆందోళనట. అసలే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులోళ్లం... ఎక్కడికి పంపించినా నో చెప్పకుండా.. నోరెత్తకుండా మూటముళ్లె సర్దుకుని వెళ్లాల్సిందే.
అందుకే తమకి ఎక్కడ పోస్టింగ్ ఇస్తారో.. ఎప్పుడు ఎక్కడికి వెళ్లాల్సి వస్తుందో ఏమోననే భయం తమని వెంటాడుతోందని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఒకాయన వాపోయారు. ఈ మాటలు ఆయనొక్కరే అంటున్నవి కావు.. సెక్రటేరియట్ సర్కిల్స్‌లో దాదాపు 130 మంది ఐఏఎస్ అధికారులు బిక్కుబిక్కుమంటూ ఒకరికొకరు చెప్పుకుంటున్న అభిప్రాయం. ఇక నాన్ లోకల్ ఐఏఎస్‌ల పరిస్థితి మరో రకంగా వుంది. ఎక్కడి నుంచో వచ్చి ఇప్పుడిప్పుడే '' అమ్మా.. నాన్న.. అక్క.. చెల్లి..'' అంటూ చిన్నగా తెలుగు నేర్చుకుని హమ్మయ్య అనుకుంటున్న తరుణంలో తమని మళ్లీ తీసుకెళ్లి ఎక్కడ పడేస్తారోననేది వారి భయమట. ప్రజా పరిపాలనలో ప్రధాన పాత్ర పోషిస్తున్న తమని ఈ విషయంలో ప్రభుత్వం గుర్తిస్తుందా? తమ అభిప్రాయానికి విలువిస్తుందా? తమ గొంతు ఏం చెబుతుందో, ఏం కావాలంటుందో వినిపించుకునేవాళ్లెవరయినా వుంటారా అని వాళ్లు ఆలోచనలో పడ్డారు. మరి వీళ్ల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా అంటే.. '' ఏమో!  డౌటే'' అనే సందేహం సమాధానంగా వస్తోంది. ఏం జరగనుందో జస్ట్ వెయిట్ అండ్ సీ!

india today lo pawan ku chotu

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి గాసిప్స్ టాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. ఈ విషయంపై మీడియాలో పుకార్లు షికార్లు చేస్తూనే వున్నాయి. పవన్ కళ్యాణ్ మూడో పెళ్లికి సంబంధించి చిన్న విషయం లీకైనా నెట్‌లలో రయ్యిమని చక్కర్లు కొడుతుంది. ఇప్పటికీ ఈ విషయం హాట్ టాపిక్‌గానే మిగిలుంది.  ఇప్పుడు తాజాగా మరో వార్త బయటికొచ్చింది. 
అదేంటంటే...ఇండియా టుడే మ్యాగజైన్‌ పవన్ కళ్యాణ్ మీద ఓ స్పెషల్ ఎడిషన్ రిలీజ్ చేస్తోంది. దీనికి సంబంధించి పవన్ పర్సనల్ విషయాలు కూడా కొన్ని వుంటాయి. అవి ఇప్పటివరకు ఎవరికి తెలియనవి, అభిమానులు ఆత్రుతగా ఎదురు చూసే లాంటివి వుంటేనే ప్రత్యేక ఎడిషన్‌కు డిగ్నిటీ వుంటుంది. ఈ నేపథ్యంలోనే సదరు మ్యాగజైన్ పవర్ స్టార్‌ను గత కొంతకాలం నుంచి హాట్ టాపిక్‌గా నిలిచిన మూడో పెళ్లి విషయమై ప్రశ్నించింది. అయితే...దీనిపై పవన్ మాట్లాడుతూ ‘పర్శనల్ విషయాలన్నారు కదండీ, వాటిని పర్శనల్‌గానే ఉంచాలని నా ఉద్దేశ్యం. వీటి మీద బయట మాట్లాడటానికి ఏమీ ఉండదు’ అని తేల్చి చెప్పేడట. దీంతో వారు కూడా అంతే సైలెంట్‌గా మిన్నకుండిపోయారని సమాచారం. 
 

    pawan ku teerika dorikindi..gabbarsingh2 radi

    ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ‘గబ్బర్‌సింగ్ 2’ లాంచ్ అయ్యింది. శుక్రవారం ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానం‌లో వేకువజామున నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి పవన్ హాజరయ్యాడు. నిర్మాత శరత్ మరార్, దర్శకుడు సంపత్ నంది, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, రచయిత సత్యానంద్ తదితరులు పాల్గొన్నారు.

    జి.కె.మరార్ క్లాప్, ప్రకాష్ స్విచ్‌ఆన్, నాయవాది ప్రమోద్‌రెడ్డి ఫస్ట్‌షాట్‌ను డైరెక్ట్ చేశారు. ఈ మూవీ గబ్బర్‌సింగ్‌కు సీక్వెల్ కాదని కథ, మాటలు పవన్ పర్యవేక్షణలో మే నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. దసరాకు థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు నిర్మాత శరత్ మరార్ చెప్పాడు.
     

      desam vypu mantrulu

      రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. దీంతో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన కొంతమంది నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై అప్పుడే వేరే పార్టీలలో కర్చీఫ్‌లు వేసేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా పార్టీలకు చెందిన నేతలు మరో పార్టీల్లో జంప్ అయ్యారు. తాజాగా అదే బాట పడుతున్నారు కొంతమంది సీమాంధ్రకు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు. వచ్చే నెల 8వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు గంటా శ్రీనివాసరావు.
      ఈ అంశంపై ఆయన శుక్రవారం తన నియోజకవర్గ నేతలతో పాటు జిల్లా టీడీపీ నేతలతో కీలక చర్చలు జరిపారు. చివరికి ఆయన తన సొంత పార్టీకే వెళ్లాలని నిశ్చయించుకున్నారు. గంటా టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు గత కొంతకాలం నుంచి మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈయనతో పాటు మరో నలుగైదుగురు ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరే అవకాశాలున్నాయి. మరోవైపు...అదే పార్టీకి చెందిన చిత్తూరు జిల్లా మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కూడా టీడీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధమైనట్టు వార్తలొస్తున్నాయి. తన కుమారుడు గల్లా జయదేవ్‌ను టీడీపీ తరపున ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపేందుకు వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు గుంటూరు నగరంలో శుక్రవారం గల్లా జయదేవ్ భారీ కటౌట్లు వెలిశాయి. దీంతో ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. మరో ముందడుగు పేరుతో నగరంలో ఆయన కటౌట్లు నిర్మించారు. ఈనెల 24 లేదా 27 తేదీలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం. 
       

      antha kukkalu chimpina visthari gurinche...

      రాష్ట్ర విభజన అంశంతో గత కొంతకాలం ఆగమ్యగోచరంగా తయారైన రాష్ట్ర రాజకీయాలు ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతున్న కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో మరొకరిని నియమించడమా లేక రాష్ట్రపతి పాలనా విధించాలా అదీ కాకుండా వీలైనంత త్వరగా రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేసేసి, ఇద్దరు ముఖ్యమంత్రులను నియమించి అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయడమా? అనే అంశాలపై ఢిల్లీ పెద్దలు తర్జన భర్జన పడుతున్నారు. శుక్రవారం పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడడంతో రాష్ట్ర వ్యవహారాలపై దృష్టి సారించింది కేంద్రాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం. ఈ విషయంపై ఏక్షణమైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రపతి పాలనకే న్యాయనిపుణులు అధికంగా ప్రాధాన్యతనిస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లో విభజన క్రమాన్ని పూర్తి చేసి... మూడు, నాలుగు నెలల తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే సముచితంగా వుంటుందటున్నారు. కానీ, రాష్ట్రపతి పాలన విధించిన రెండు నెలల్లోపు పార్లమెంటు ఆమోదం పొందాలి. అయితే.. శుక్రవారమే పార్లమెంటు నిరవధిక వాయిదా పడింది. దీంతో న్యాయపరమైన చిక్కలు ఎదుర్కునే అవకాశాలున్నాయి. అందుకే రాష్ట్రపతి పాలన ఆలోచనను పక్కన పెట్టినట్టు వాదన వినిపిస్తోంది.

      మరోవైపు... ఇప్పటికిప్పుడు సీమాంధ్రలో ఎన్నికలకు వెళితే... కాంగ్రెస్‌కు చావు దెబ్బ ఖాయమని ఆ ప్రాంత నేతలు ఆందోళన చెందుతున్నారు. ఓ ఆరునెలలు ఆగితే అవకాశాలు మెరుగవుతాయని అధిష్ఠానానికి విన్నవిస్తున్నారు. అలాగే విభజన అమల్లోకి వచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళితే తెలంగాణ జిల్లాల్లో పార్టీకి మంచి ఫలితాలొస్తాయని ఆ ప్రాంత నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా 'అప్పాయింట్ డే' ప్రకటించి, రెండు రాష్ట్రాలకు ఇద్దరు ముఖ్యమంత్రులను నియమించి... అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసే అవకాశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్టు కూడా సమాచారం వుంది. ఇప్పటికే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రణబ్ ముఖర్జీ సంతకం కోసం పంపారు. మొత్తానికి... ఈ అంశంపై శనివారమే తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 

      samaikya rastram mukkalaindi..

      ఆంధ్ర రాష్ట్రం ముక్కలు అయ్యింది . తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్ ఆమోదం లబించింది . సీమాంద్ర ,తెలంగాణా రాష్ట్రాలు ఏర్పాటు జరుగుతోంది . ఆంద్ర ఇక లేనట్టే . కిరణ్ ఆంద్ర చివరి ముఖ్యమంత్రి . బిల్ ను రాష్ట్రపతి ఆమోదం తరువాయి . ప్రాసెస్ ఇక మిగిలిఉంది .