13, మే 2014, మంగళవారం

12, మే 2014, సోమవారం

శ్రీచక్రపురానికి గురుపాదుకలు రాక


శ్రీకాకుళం పట్టణందరి నవభారత్జంక్షన్ వద్ద ఉన్న దేవీ ఆశ్రమంలో మంగళవారం రాత్రికి గురుపాదుకలు వస్తున్నాయని ఆశ్రమ వ్యవస్థాపకులు తేజోమూర్తుల బాలభాస్కరశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం రాత్రికి వచ్చిన ఈ పాదుకలను ఆశ్రమంలో ఉంచి మరుసటి రోజు పౌర్ణమి సందర్భంగా ఈ పాదుకులకు విశేష పూజలు నిర్వహించి అనంతరం భక్తుల దర్శనార్ధం ఉంచడం జరుగుతుందని అన్నారు. ఈ పాదుకలు అరుణాచలం నుండి గణపతి మునీంద్రుల పాదులని పలువురి పండితులు భావిస్తున్నారు. ఈ పాదుకలు రమణ మహర్షికి దైవికంగా వచ్చినట్లు పురాణాలు ఘోషిస్తున్నాయని వినికడని అన్నారు. ఈ పాదుకలను దర్శనం చేసుకొన్నవారికి అనారోగ్యాలు తొలగునని భక్తుల ప్రగాఢ విశ్వసం. అలాగే బుధవారం పౌర్ణమి సందర్భంగా 4 గం. ల నుండే మూల విరాట్టుకు విశేష పూజలు నిర్వహించి అనంతరం వచ్చే భక్తులతో కుంకుమార్చన చేయించడం జరుగుతుందని బాలభాస్కరశర్మ తెలిపారు. కనుక కుంకుమార్చనలో పాల్గొనడానికి వచ్చే భక్తులు ఉదయం 9 గం. లకు సంప్రదాయ దుస్తులు ధరించి రాగలరని తెలిపారు.