మెగాస్టార్ 60 జన్మదిన వేడుకలు ఎంత హంగు ఆర్భాటంగా జరిగినా.. కొందరు లేని, రాని లోటు స్పష్టంగా కనిపించిందని అక్కడికొచ్చినవాళ్లు మాట్లాడిన మాటలు. వస్తాడో రాడో అనుకున్న పవన్.. చిరు ఇంటికి వెళ్లి మరీ బర్త్ డే విషెస్ చెప్పి గంటపైగా అక్కడ కూర్చొని మళ్ళీ పార్క్ హయత్ పార్టీలో అటెండ్ కావడం హైలైట్ అంటున్నారు. కానీ రెండుచోట్లా పవన్ మరీ సీరియస్‌గా ఉంటూ ఫ్యాన్స్ కోసం తప్పదన్నట్టుగా వచ్చినట్టుగానే ఉందనే కామెంట్స్ వచ్చాయి.
అలానే స్పెషల్ ఇంటర్వ్యూస్‌లో బాలకృష్ణ పేరు ప్రస్తావించకుండా మిగతా మోహన్‌బాబు, నాగార్జున, వెంకీ, రవితేజ, శ్రీకాంత్ అందరూ మిత్రులే అన్నాకూడా బాలయ్య హాజరై అందరికీ షాక్ ఇచ్చాడు. వీటన్నిటికంటే చిరుతో సూపర్ హిట్ కాంబో అనిపించుకున్న రాధిక, విజయశాంతి, కృష్ణ హాజరుకాకపోవడం ఈ వేడుకల్లో హాజరు కాకపోవడం లోటే అని కామెంట్స్ వినిపించాయి.