శ్రీకాకుళం
శ్రీకాకుళం పట్టణం దరి నవభారత్ జంక్షన్ వద్ద ఉన్న 1001 శ్రీచక్రాల దేవీ ఆశ్రమంలో రాజరాజేశ్వరి అమ్మవారి మూలవిరాట్టుకు శుక్రవారం ఉదయం 5 గం॥ల నుండి పాలభిషేకంతోపాటు పసుపు, చందనం, కుంకుమ, విభూదిలతో ప్రత్యేక అభిషేకాలు ఆశ్రమ వ్యవస్థాపకులు తేజోమూర్తుల బాలభాస్కరశర్మ నిర్వహించారు. అనంతరం అమ్మవారికి శ్రీచక్రార్చ న, కుంకుమార్చన చేశారు. పూజల అనంతరం ఆయన మాట్లాడుతూ వైశాఖ మాసంలో తదియ రోజున ఈ అక్షర తదియ వస్తుందని దీనిని అక్షరతృతీయ అంటారని అన్నారు. ఈ రోజున అమ్మవారికి పూజలు చేస్తే సకలదోషాలు తొలగి సుఖసంతోషాలతో వర్ధిల్లుతారని అన్నారు. ష్టచక్రాలు గురించి వివరిస్తూ ఈ రోజు మూలాధారం నుంచి సహాస్రానం వరకు గురువు ద్వారా పొందిన మూలమంత్రంతో జపం చేస్తే శరీరం అంతా తేజోవంతం అవుతుందని తెలిపారు. వచ్చిన భక్తులకు తీర్ధప్రసాదాలు ఇచ్చి 14వ తేదీన పౌర్ణమికి సంప్రదాయ దుస్తులు ధరించి శ్రీచక్రాల వద్ద అమ్మవారికి కుంకుమార్చనలో పాల్గొనడానికి అవకాశం లభిస్తుందని అన్నారు. ఈ వైశాఖమాసంలో కుంకుమార్చన వల్ల దేహంలో ఉన్న రుగ్మతలు తొలగి శరీరం కాంతివంతంగా మారుతుందని పలువురు భక్తులు తమ అభిప్రాయాలు తెలిపారు.