7, జూన్ 2015, ఆదివారం
aagina arthi gunde chappudu
భారత్‌లోని గుజరాతీ సంప్రదాయ కుటుంబానికి చెందిన ఆర్తి అగర్వాల్ అమెరికాలోని న్యూజెర్సీలో పుట్టి పెరగడంతోపాటు అక్కడే చదువుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ సినిమా 'పాగల్‌పన్' కోసం 2001లో ఇండియాకొచ్చిన ఆర్తి.. అదే సంవత్సరంలో తెలుగులో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో లీడ్ రోల్ పోషించే ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమాలో ఆర్తి పర్‌ఫార్మెన్స్, గ్లామర్ అన్నీ బాగుండటంతో ఆ వెంటనే ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చిపడ్డాయి.
నువ్వు నాకు నచ్చావ్ తర్వాత నువ్వు లేక నేను లేను, అల్లరి రాముడు, ఇంద్ర, నీ స్నేహం, పల్నాటి బ్రహ్మనాయుడు, వసంతం, వీడే, అడవి రాముడు, నరసింహుడు, అందాల రాముడు వంటి సినిమాల్లో నటించింది. అయితే తన కెరీర్ ఎంత వేగంగా పుంజుకుందో అంతే వేగంగా పడిపోవడం ఆర్తిని కొంత కుంగదీసింది. తెలుగులోనే దాదాపు 20కుపైగా సినిమాలు చేసిన ఆర్తి... అవకాశాలు తగ్గిన తర్వాత కొన్ని ఐటంగాళ్ పాత్రలు కూడా చేసింది. కొన్ని సినిమాలకే లావు పెరగడం, 2005లో లవ్ స్టోరీ కారణంగా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం వంటివి ఆమెకి అవకాశాలు సన్నగిల్లిపోయేలా చేశాయి. చివరిగా అమ్మ రాజశేఖర్‌తో 'ఆమె ఎక్కడ' సినిమా చేసిన ఆర్తి.. లైపోసక్షన్ ట్రీట్‌మెంట్ కోసం న్యూజెర్సీకి వెళ్లి తాను పుట్టి పెరిగిన చోటే కన్నుమూసింది.
parti mari poya ika naketi
మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ర్ట ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఏడాదిపాటు కాంగ్రెస్‌లో వుండి ఎన్నో ప్రయత్నాలు చేశాను. అయినా కాంగ్రెస్‌లో వుండి ప్రజలకు ఎటువంటి న్యాయం చేయలేకపోతున్నాను. కాంగ్రెస్ పోరాటల వల్ల ప్రజలకు మేలు జరగడంలేదు. టీడీపీ పరిపాలన ప్రజా వ్యతిరేకంగా వుంది. ప్రజలకు ఇచ్చిన హామీలని టీడీపీ నెరవేర్చడం లేదు. అందుకే ఒక బాధ్యత గల కాంగ్రెస్ నేతగానే రాజీనామా చేశాను. జగన్‌కి అండగా వుండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను.
వైఎస్‌తో నాకు ఎంతో అనుబంధం వుంది. నన్ను నమ్ముకున్న వారికి న్యాయం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు వున్న అనుభవాన్ని ఇకపై వైఎస్సార్సీ కోసం ఉపయోగిస్తాను. పార్టీ నిర్ణయాలని క్రమశిక్షణతో అమలు చేస్తాను. కాంగ్రెస్ పార్టీ నాకే ద్రోహం చేయలేదు. నన్నేం కించపరచలేదు. కేవలం ప్రజలకు మేలు జరగాలనే తాను కాంగ్రెస్‌ని వీడి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరాను. అంతకు మించి మరే స్వార్థం లేదని అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నట్లు తెలిపారు.
31, మే 2015, ఆదివారం
10, మే 2015, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)