29, ఏప్రిల్ 2015, బుధవారం

maruthunna bhubramanam

ఉత్తరాది ప్రాంతమంతా కూడా నేపాల్ దిశగా కదులుతున్నట్లు కనిపిస్తోందని గుర్తు చేశారు. లోగడ 1934లో బీహార్‌లో సంభవించిన పెను భూకంపంలో కూడా అక్కడి భూభాగంలో సుమారు 12 అడుగులు నేపాల్ దిశగా కదిలిన విషయాన్ని పరిశోధకులు పేర్కొన్నారు. శనివారం నేపాల్‌లో వచ్చిన భూకంపం అనూహ్యమేమీ కాదని, ఐతే ఇంత భారీగా సంభవిస్తుందని మాత్రం తాము అంచనా వేయలేదని వారంటున్నారు. ఇదిలావుండగా హిమాలయాల ఎత్తు ముఖ్యంగా ఎవరెస్ట్‌ పర్వతం ఎత్తు పెరగలేదని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. లేకుంటే ఇప్పటికే 8,848 మీటర్ల ఎత్తున్న ఎవరెస్ట్‌ మరికొంత పెరిగేదని అంటున్నారు. ఐతే, ఎవరెస్ట్‌ ఎత్తు పెరగనంత మాత్రాన. ఇతర పరిణామాలు ఆగేలా లేవు. భారత ఉపఖండం యథా ప్రకారం ఉత్తరానికి జరుగుతూ తన పరిమాణాన్ని తగ్గించుకుంటూనే ఉంటుంది. టిబెట్‌, నేపాల్‌, భారత్‌, పాకిస్థాన్‌, బర్మా ప్రాంతాలకు ఎప్పుడైనా, ఎక్కడైనా భూకంప ప్రమాదం మరింత పెరిగింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి