7, జూన్ 2015, ఆదివారం

aagina arthi gunde chappudu

భారత్‌లోని గుజరాతీ సంప్రదాయ కుటుంబానికి చెందిన ఆర్తి అగర్వాల్ అమెరికాలోని న్యూజెర్సీలో పుట్టి పెరగడంతోపాటు అక్కడే చదువుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ సినిమా 'పాగల్‌పన్' కోసం 2001లో ఇండియాకొచ్చిన ఆర్తి.. అదే సంవత్సరంలో తెలుగులో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో లీడ్ రోల్ పోషించే ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమాలో ఆర్తి పర్‌ఫార్మెన్స్, గ్లామర్ అన్నీ బాగుండటంతో ఆ వెంటనే ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చిపడ్డాయి. 
నువ్వు నాకు నచ్చావ్ తర్వాత నువ్వు లేక నేను లేను, అల్లరి రాముడు, ఇంద్ర, నీ స్నేహం, పల్నాటి బ్రహ్మనాయుడు, వసంతం, వీడే, అడవి రాముడు, నరసింహుడు, అందాల రాముడు వంటి సినిమాల్లో నటించింది. అయితే తన కెరీర్ ఎంత వేగంగా పుంజుకుందో అంతే వేగంగా పడిపోవడం ఆర్తిని కొంత కుంగదీసింది. తెలుగులోనే దాదాపు 20కుపైగా సినిమాలు చేసిన ఆర్తి... అవకాశాలు తగ్గిన తర్వాత కొన్ని ఐటంగాళ్ పాత్రలు కూడా చేసింది. కొన్ని సినిమాలకే లావు పెరగడం, 2005లో లవ్ స్టోరీ కారణంగా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం వంటివి ఆమెకి అవకాశాలు సన్నగిల్లిపోయేలా చేశాయి. చివరిగా అమ్మ రాజశేఖర్‌తో 'ఆమె ఎక్కడ' సినిమా చేసిన ఆర్తి.. లైపోసక్షన్ ట్రీట్‌మెంట్ కోసం న్యూజెర్సీకి వెళ్లి తాను పుట్టి పెరిగిన చోటే కన్నుమూసింది. 

parti mari poya ika naketi

మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ర్ట ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఏడాదిపాటు కాంగ్రెస్‌లో వుండి ఎన్నో ప్రయత్నాలు చేశాను. అయినా కాంగ్రెస్‌లో వుండి ప్రజలకు ఎటువంటి న్యాయం చేయలేకపోతున్నాను. కాంగ్రెస్ పోరాటల వల్ల ప్రజలకు మేలు జరగడంలేదు. టీడీపీ పరిపాలన ప్రజా వ్యతిరేకంగా వుంది. ప్రజలకు ఇచ్చిన హామీలని టీడీపీ నెరవేర్చడం లేదు. అందుకే ఒక బాధ్యత గల కాంగ్రెస్ నేతగానే రాజీనామా చేశాను. జగన్‌కి అండగా వుండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను.
వైఎస్‌తో నాకు ఎంతో అనుబంధం వుంది. నన్ను నమ్ముకున్న వారికి న్యాయం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు వున్న అనుభవాన్ని ఇకపై వైఎస్సార్సీ కోసం ఉపయోగిస్తాను. పార్టీ నిర్ణయాలని క్రమశిక్షణతో అమలు చేస్తాను. కాంగ్రెస్ పార్టీ నాకే ద్రోహం చేయలేదు. నన్నేం కించపరచలేదు. కేవలం ప్రజలకు మేలు జరగాలనే తాను కాంగ్రెస్‌ని వీడి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరాను. అంతకు మించి మరే స్వార్థం లేదని అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నట్లు తెలిపారు. 

10, మే 2015, ఆదివారం

maoist cc muralidharan arrest

Pune Maoist arrest, Maoist leader arrested, Ajith arrested, Maharashtra Maoist arrest, Maoist Pune, Pune, Maharashtra news, india news
AdTech Ad
Alleged Maoist leader K Muralidharan alias Ajith alias Thomas Joseph (62) and his suspected aid Ismail Hamaza Chiragpalli (29) were arrested by Pune unit of Maharashtra Anti Terrorism Squad (ATS) on Friday morning and produced in a special court on Saturday

29, ఏప్రిల్ 2015, బుధవారం

neethu cheppina avineethi kadhalu

ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో బడా నేతల బాగోతం బయటకొస్తోంది. ఓ ఎమ్మెల్యేతోపాటు మరో ఇద్దరు నేతలకు ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అరెస్టయిన సినీనటి నీతూ అగర్వాల్ కర్నూలు పోలీసుల విచారణలో సంచనల విషయాలు వెల్లడించినట్లు సమాచారం. ఎర్రచందనం స్మగ్లర్ మస్తాన్ వలీతో సహజీవనం నిజమేనని... అతను కొంతమంది స్మగ్లర్లతో మాట్లాడించేవాడని, తన ఎకౌంట్ ద్వారానే వారికి నగదు బదిలీలు జరిపేవాడని పోలీసుల విచారణలో వెల్లడించిందామె. 
ప్రేమ ప్రయాణం మూవీ ద్వారా ఏర్పడిన పరిచయంతో తర్వాతి కాలంలో ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. మస్తాన్ తనకు హైదరాబాద్‌లో ఓ ఇల్లు కొనివ్వడంతోపాటు కొంత నగదు మొత్తాన్ని కూడా తన పేరిట డిపాజిట్ చేశాడని నీతూ అంగీకరించింది. ఇవన్నీ పాత విషయాలే అయినా ఇప్పుడామె చెప్పినవాటిలో కొత్తవి కొన్ని రాజకీయ నేతల్లో గుబులురేపుతున్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, మరో ఇద్దరు రాజకీయ నేతలకు ఈ ఎర్ర చందనం స్మగ్లింగ్‌తో ప్రత్యక్ష సంబంధాలున్నాయని నీతూ తన వాంగ్మూలంలో పేర్కొంది. దీంతో నీతూ వెల్లడించిన వివరాల ఆధారంగా సదరు నేతల జాతకాలు బట్టబయలు చేసే పనిలో పోలీసులు బిజీ అయ్యారు.

maruthunna bhubramanam

ఉత్తరాది ప్రాంతమంతా కూడా నేపాల్ దిశగా కదులుతున్నట్లు కనిపిస్తోందని గుర్తు చేశారు. లోగడ 1934లో బీహార్‌లో సంభవించిన పెను భూకంపంలో కూడా అక్కడి భూభాగంలో సుమారు 12 అడుగులు నేపాల్ దిశగా కదిలిన విషయాన్ని పరిశోధకులు పేర్కొన్నారు. శనివారం నేపాల్‌లో వచ్చిన భూకంపం అనూహ్యమేమీ కాదని, ఐతే ఇంత భారీగా సంభవిస్తుందని మాత్రం తాము అంచనా వేయలేదని వారంటున్నారు. ఇదిలావుండగా హిమాలయాల ఎత్తు ముఖ్యంగా ఎవరెస్ట్‌ పర్వతం ఎత్తు పెరగలేదని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. లేకుంటే ఇప్పటికే 8,848 మీటర్ల ఎత్తున్న ఎవరెస్ట్‌ మరికొంత పెరిగేదని అంటున్నారు. ఐతే, ఎవరెస్ట్‌ ఎత్తు పెరగనంత మాత్రాన. ఇతర పరిణామాలు ఆగేలా లేవు. భారత ఉపఖండం యథా ప్రకారం ఉత్తరానికి జరుగుతూ తన పరిమాణాన్ని తగ్గించుకుంటూనే ఉంటుంది. టిబెట్‌, నేపాల్‌, భారత్‌, పాకిస్థాన్‌, బర్మా ప్రాంతాలకు ఎప్పుడైనా, ఎక్కడైనా భూకంప ప్రమాదం మరింత పెరిగింది.

nepal bhukampam taruvatha chitralu